- Advertisement -
సమంత టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొంత కాలం ఓ వెలుగు వెలిగింది. తరువాత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని తన వైవహిక జీవితాన్ని హాయిగా గడుపుతుంది.ఈ భామ ప్రస్తుతం రంగస్థలం హిట్‌తో మంచి జోష్‌లో ఉంది. తన తరువాత సినిమా మహానటి, అభిమన్యుడు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.సమంత తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.
తనకు సెల్ఫీలు దిగడమంటే ఇష్టం ఉండదట. ఈ విషయాన్ని స్వయంగా సమంతే ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..‘నాకు సెల్ఫీలు నచ్చవు కానీ ఇది మాత్రం దిగాల్సిన సెల్ఫీనే. ఇది సెంట్రల్ పార్క్. ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడే మొదలైంది. ఇందుకు ధన్యవాదాలు చెప్పడానికే మళ్లీ ఇక్కడికి వచ్చాం’ అని క్యాప్షన్ ఇచ్చారు.
