అడివి శేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం డెకాయిట్. ఏప్రిల్ 10, 2026న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో షనిల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంపై ప్రముఖ నటి సమంత ప్రశంసలు కురిపించారు. చిత్ర బృందం చేసిన కష్టాన్ని కొనియాడుతూ ముఖ్యంగా నిర్మాత సుప్రీయా యార్లగడ్డకు బ్లాక్బస్టర్ హిట్ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ విజయానికి సుప్రియకంటే ఎక్కువగా అర్హత ఉన్నవారు ఎవరూ లేరు అని సమంత పేర్కొన్నారు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్థాయిలో ఉండటంతో, ఈ సినిమా ఈ వారం విడుదలలలో ప్రధాన ఆకర్షణగా మారింది. సమంత మద్దతు కూడా సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది.ఈ చిత్రంలో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్ , జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
