అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందం కీలకం కానుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగీర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుని ఏప్రిల్ 10న అమెరికాతో శాంతి చర్చలు జరపనుంది.
ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు కొనసాగించడంతో ప్రతిస్పందనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఈ దాడుల్లో కనీసం 180 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా బీరూట్‌లోని నివాస, వాణిజ్య ప్రాంతాలపై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించి, వేలాది మంది గాయపడ్డారు.యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇందులో తమ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని అంగీకరించాలి, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని అమెరికాను కోరింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వరలో ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయనకు దేశ అత్యున్నత సాంస్కృతిక గౌరవమైన “ఇజ్రాయెల్ ప్రైజ్” ఇవ్వనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, లెబనాన్‌పై దాడులు, హోర్ముజ్ మూసివేత, అణు వివాదాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. శాంతి చర్చలు ఫలిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
