Friday, May 10, 2024
- Advertisement -

నేను ఏం పోస్ట్ చేసిన చైతు అనుమ‌తితోనే : స‌మంత‌

- Advertisement -

హీరోయిన్ స‌మంత హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.పెళ్లి త‌రువాత చాలా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఉంటోంది స‌మంత‌.చాలా సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది.స‌మంత పెళ్లి త‌రువాత న‌టించిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్లే.సినిమాల‌లో అయితే సంప్ర‌దాయంగానే ఉంటుంది కాని బ‌య‌ట మాత్రం ఆ విధాంగా ఉండ‌లేక‌పోతుంది స‌మంత‌.సోష‌ల్ మీడియాలో ఆమె పెట్టే కొన్ని ఫోటోలు అక్కినేని అభిమానుల‌కు అస‌లు న‌చ్చ‌డం లేదు.తాజాగా దీనిపై స్ప‌దించింది స‌మంత‌.

సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్‌ పెట్టే విషయంలో తన భర్త, హీరో చైతన్య విషయంలో మాత్రం అతని అనుమతి లేకుండా ఏ పనీ చేయనంటోంది. సోషల్‌ మీడియాలో చైతూకి సంబంధించిన వీడియో అయినా, ఫొటో అయినా పెట్టాలంటే ముందు అతని అనుమతి కోరతానని చెబుతోందీ ముద్దుగుమ్మ.తనతోపాటు చైతన్య చిత్రాల విషయాలే కాదు, వ్యక్తిగత విషయాలను కూడా సామ్‌ అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సమంత నటించిన కన్నడ రీమేక్‌ ‘యూ టర్న్‌’ ఈ నెల 13న విడుదవుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -