Wednesday, May 22, 2024
- Advertisement -

నా బోయ్ ఫ్రెండ్ నాన్న‌కు ఎప్పుడు విల‌నే : సోన‌మ్‌ క‌పూర్

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన సోన‌మ్ క‌పూర్ త‌క్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది.ఒక‌ప్ప‌టి హీరో అనిల్ క‌పూర్ కుత‌రిగా ఇండస్ట్రీకి ప‌రిచియ‌మైన అన‌తి కాలంలోనే త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.సోన‌మ్ క‌పూర్ ఇటీవ‌లే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.ఇరు కుటుంబాల అంగీకారతోనే ఈ పెళ్లి జ‌రిగింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.అయితే తాజాగా త‌న భ‌ర్త ,తండ్రిల మ‌ధ్య ఉన్న సంబంధాన్ని బ‌య‌ట‌పెట్టింది సోన‌మ్‌.అనిల్ కపూర్‌కు బాలీవుడ్‌లో చాలా కూల్ పర్సన్ అనే ఇమేజ్ ఉంది.

తనకు ఎవరైనా అబ్బాయిలు దగ్గరవుతున్నారని తెలియగానే… తన తండ్రి వారికి విలన్ గా మారిపోయేవారని తెలిపింది. తన బోయ్ ఫ్రెండ్స్ జీవితాల్లో ఆయన ఎప్పుడూ విలనే అని చెప్పింది. వాళ్లతో తనకు మంచి సంబంధాలు లేవని తెలిస్తే మాత్రం ఎంతో సంతోషించేవారని చెప్పింది. కాని నా భర్త ఆనంద్ అహూజా విషయంలో తన తండ్రి అనిల్ కపూర్ ప్ర‌వ‌ర్త‌న ఎప్పుడు మంచిగానే ఉండేద‌ని తెలిపింది.ఇక సోన‌మ్ పెళ్లి త‌రువాత కూడా సినిమాలలో న‌టిస్తుంది.పెళ్లి త‌రువాత సోన‌మ్ మ‌రింత హాట్ హాట్ న‌టిస్తు త‌ర‌చు వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -