Sunday, May 5, 2024
- Advertisement -

నిర్మాతగా మారునున్న హీరోయిన్

- Advertisement -

సమంత. అందమే కాదు.. అభినయంతో కూడా ఆకట్టుకుంటున్న హీరోయిన్. దక్షిణాది భాషల్లో మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతోంది. దీంతో నటిగా మంచి గుర్తింపు వచ్చే పాత్రలు చేయడం లేదే అని దిగులు సమంతను వేధిస్తోంది. దీంతో లేడీ ఓరియంటెడ్ పాత్రను చేసి తనలో ఉన్న నటిని ప్రపంచానికి చూపించాలని భావిస్తోంది ఈ హీరోయిన్.

ఇందుకు తానే నిర్మాతగా మారి సినిమా తీయాలనే ఆలోచనలో కూడా ఉందట. అయితే డైరక్ట్ స్టోరీ అయితే దెబ్బ తినే అవకాశం ఉంటుందని, అదే రీమేక్ అయితే మంచిదని కొందరు సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆ పనిలో పడింది సమంత. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ము టర్న్ చిత్రం హక్కులు కొనుగోలు చేసి తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రీమేక్ చేయాలన్నది సమంత ఆలోచన.

హీరో నాగ చైతన్యతో కలిసి ఈ సినిమా చూసిన సమంతకు ఆ హీరో కూడా అదే సలహా ఇచ్చాడట. ఇంకెముంది తన నిర్మాణ సారధ్యంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సమంత ఫిక్స్ అయిపోయిందని పరిశ్రమలో ఓ టాక్. చూద్దాం.. కొత్త పాత్రలో సమంత ఎలా సక్సెస్ అవుతుందో.. ఆల్ ది బెస్ట్ సమంత. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -