Friday, May 17, 2024
- Advertisement -

సమ్మోహనం మూవీ రివ్యూ

- Advertisement -

సుధీర్‌ బాబు హీరోగా అదితిరావు హైదరీని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సమ్మోహనం నిజంగానే సమ్మోహన పరిచిందా..? మోహనకృష్ణ మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారా..? సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం రండీ!

కథ : విజ్జు (సుధీర్‌ బాబు) అందరు అబ్బాయిల్లా గర్ల్‌ ఫ్రెండ్స్‌, సినిమాలు అంటూ తిరగటం ఇష్టం లేని కుర్రాడు. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు బొమ్మలతొ చిన్నపిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. ఎలాగైన అనగనగా పబ్లికేషన్స్‌ ద్వారా తన బొమ్మల పుస్తకాన్న విడుదల చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు. విజ్జు తండ్రి సినిమాల మీద ఇష్టంతో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరి సినిమా ప్రయాత్నాలు చేస్తుంటాడు. తన ఇంట్లో షూటింగ్ చేసుకోనిస్తే వేషం ఇస్తానని చెప్పటంతో ఓ సినిమా షూటింగ్‌కు ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తాడు . ఆ సినిమాలో హీరోయిన్‌ సమీరా రాథోడ్‌ (అదితి రావు హైదరీ). షూటింగ్ ప్రారంభమైన తరువాత తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సమీరాకు విజ్జు కోచింగ్‌ ఇస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. షూటింగ్ తరువాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి తన ప్రేమ విషయం చెపుతాడు. త‌న ప్రేమ‌ను విజ్జు ఓకే చేసిందా? లేదా? అన్న‌దే మిగతా కథ.

నటీనటులు :విజయ్‌ పాత్రలో సుధీర్‌ బాబు ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో మంచి పరిణతి కనబరిచాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అ‍ద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో అదితి రావు హైదరీ జీవించారు. స్టార్‌ ఇమేజ్‌, ప్రేమ, వేదింపుల మధ్య నలిగిపోయే అమ్మాయిగా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా చూపించారు.

విశ్లేషణ :సమ్మోహనం అనే టైటిల్‌తోనే ఆకట్టుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కథా కథనాలతో నిజంగానే సమ్మోహనపరిచారు. ప్రేమకథకు బలమైన ఎమోషన్స్‌, కామెడీని జోడించి మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ముఖ్యంగా తొలి భాగంలో హీరో ఇంట్లో షూటింగ్ సమయంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. చాలా సందర్భాల్లో డైలాగ్స్‌ మన జీవితాల నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తాయి.ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బోట‌మ్ లైన్ : మొత్త‌నికి స‌మ్మోహ‌న ప‌రిచారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -