Saturday, May 11, 2024
- Advertisement -

కొబ్బరి మట్ట ట్రైలర్: సంపూర్ణేష్ బాబు వరల్డ్ రికార్డ్

- Advertisement -

‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేష్ బాబు ఇప్పుడు ‘కొబ్బరిమట్ట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అని అనుమానాలు రేకేత్తున్న సమయంలో దర్శక నిర్మాతలు ఈ సినిమా ఆగస్టు 10వ తేదిన విడుదల కాబోతుంది అంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లు కూడా మొదలు పెట్టిన దర్శక నిర్మాతలు సినిమా నుంచి ఒక డైలాగ్ టీజర్ ను విడుదల చేశారు.

ప్రపంచ సినీ చరిత్రలోనే మూడు నిమిషాల 30 సెకండ్లు నిడివి ఉన్న సింగల్ షాట్ డైలాగ్ ఉన్న ఘనత ‘కొబ్బరి మట్ట’ సినిమా కే దక్కింది. సంపూర్ణేష్ చెప్పిన ఈ డైలాగు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో యాండ్రాయుడు పాత్ర పోషిస్తున్న సంపూర్ణేష్ పెదరాయుడు పాత్ర తో చెప్పే డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అమృత ప్రొడక్షన్స్ పతాకంపై సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో ఇషిక సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. రూపక్ రోనాల్డ్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -