Friday, May 10, 2024
- Advertisement -

రామ్ కి ఇస్మార్ట్ శంకర్ కి సంబంధం తెగిపోయిందా ?

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అయింది. ఇక ఈ సినిమా ని అందరూ మరిచిపోయే దశ కూడా చేరువ లో నే ఉంది. సినిమా ఇప్పటి వరకు చాలా బాగా ఆడింది. నిర్మాతలకి, బయ్యర్లకి లాభాలు కూడా తెచ్చి పెట్టింది. ఇప్పటికే చిత్ర యూనిట్ విజయోత్సవ సభలు, విజయోత్సవ యాత్రలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హీరో రామ్ మాత్రం సినిమా రిలీజ్ ముందు నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి అని ఎవరికీ అర్ధం కావడం లేదు.

సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కి హాజరు కాకుండా విహార యాత్ర కి వెళ్ళాడు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఎలాగో సినిమా కి క్రేజ్ ఉంది, ఓపెనింగ్స్ వస్తున్నాయి అనే ఉదేశ్యం తో వెళ్ళిపోయాడు అని. కానీ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది, సినిమా ని హిట్ గా నిర్ణయించాక కూడా ఇంకా రామ్ జాడెక్కడా లేదు అనేది కాస్త సందేహాలకు దారి తీస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి ఈ సినిమా ఎత్తేసే టైం కి రామ్ ప్రత్యక్షమయి తన తదుపరి చిత్రం గురించి చెప్తాడేమో అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మరి రామ్ గైరుహాజరు కి గల కారణాలు ఏమై ఉంటాయో ఏంటో…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -