Friday, May 17, 2024
- Advertisement -

‘అర్జున్‌రెడ్డి’ ద‌ర్శ‌కుడితో సూప‌ర్‌స్టార్ కారు మెకానిక్‌గా

- Advertisement -

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కొత్త కొత్త క‌థ‌ల‌తో విభిన్న‌మైన సినిమాల‌తో వ‌స్తుంటాడు. రొటీన్ సినిమాల‌కు కాలం చెల్లాయ‌ని న‌మ్ముతూ కొత్త‌గా.. త‌న‌కు న‌చ్చిన‌.. సమాజానికి ఓ సందేశం ఇచ్చేలా మ‌హేశ్ సినిమా క‌థ‌ల ఎంపిక ఉంటుంది. ఇప్పుడు అందులో భాగంగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ‘భరత్‌ అనే నేను’ సినిమాను చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేశ్‌బాబు మ‌రో సినిమాను అంగీక‌రించే ప‌నిలో ఉన్నారు.

‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా మాంచి హిట్ అందుకున్నాడు. తొలి సినిమాతోనే ప్ర‌తిభ చాటాడు. అర్జున్‌రెడ్డి సినిమా కూడా మహేశ్‌బాబుకు న‌చ్చేసింది. దీంతో వెంట‌నే సందీప్ మ‌హేశ్‌తో సినిమా చేస్తాడ‌ని స‌మాచారం. మహేశ్ కోసం సందీప్ ఓ కథ రాశాడంట‌. క‌థ‌ను మ‌హేశ్‌కు ఇప్పటికే వినిపించాడని తెలుస్తోంది. ఈ సినిమా ఒకే అయితే మాత్రం మ‌హేశ్‌బాబు భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సందీప్ సిద్ధం చేసిన క‌థ‌లో మహేశ్‌ కారు మెకానిక్‌ పాత్రలో క‌నిపిస్తాడు. ఈ వార్త మ‌హేశ్‌బాబు అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌లాంటిదే.

గ‌తంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన ‘ఖలేజా’ సినిమాలో మహేశ్‌ క్యాబ్‌ డ్రైవర్‌ పాత్రలో నటించాడు. ఇప్పుడు మెకానిక్ అంటే అదిపోయేలా ఉంది. ప్రస్తుతం మహేశ్ న‌టించిన ‘భరత్‌ అనే నేను’ సినిమా ఏప్రిల్ 26వ తేదీన విడుద‌ల కానుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -