Tuesday, May 21, 2024
- Advertisement -

మెగాస్టార్ సినిమాను న్యాచుర‌ల్ స్టార్ రీమేక్‌

- Advertisement -

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి హీరోగా ఎదిగిన నాని ఇప్పుడు నిర్మాత‌గా కొత్త అవ‌తారం ఎత్తాడు. విభిన్న‌మైన సినిమాగా అ!ను రూపొందించి నిర్మించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తోంది. హీరోగా నాని న‌టిస్తున్న సినిమాలు థియేట‌ర్ల వ‌ద్ద ప్రేక్ష‌కుల‌ను క్యూ క‌టిస్తున్నాయి. ఆ సినిమాల విజ‌య ప‌రంప‌ర కొన‌సాగిస్తున్న నాని ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమాను రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌.

ప్ర‌శాంత్ వ‌ర్మ‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ తాను నిర్మించిన అ! సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో నాని బిజీగా గ‌డిపాడు. ఆ స‌మ‌యంలో త‌న మ‌న‌సులోని ఒక మాట‌ను వ్య‌క్త ప‌రిచాడు. తాను ఓ క్రేజీ హీరో మూవీని రీమేక్ చేయాలనే కోరిక వెలిబుచ్చాడు. దీంతో అంత‌టా హాట్ టాపిక‌య్యింది.

చిరంజీవి జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో చంటబ్బాయి సినిమా చేశాడు. చిరంజీవి, సుహాసిని నటించిన ఈ కామెడీ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. డిటెక్టివ్‌లా చిరంజీవి నటించి హాస్యం పండించాడు. ఆ సినిమా నానికి చాలా ఇష్టం. నాని సినిమాల్లో కూడా హాస్యం ప్ర‌ధానంగా ఉంటుండ‌డంతో ఆ సినిమా రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. గ‌తంలో నాని హిందీ సినిమా బ్యాండ్ బాజా బారాత్‌ను రీమేక్ చేయ‌గా ఆక‌ట్టుకోలేదు. ఇప్పుడు చంటబ్బాయి సినిమా రీమేక్ చేస్తే మాత్రం సూప‌ర్‌గా ఉండేట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం నాని నిర్మాత‌గా మార‌డంతో త‌న బ్యాన‌ర్‌లోనే సినిమా తీస్తాడో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -