సంక్రాంతి వస్తుందంటే చాలు థియోటర్లకు క్యూ కడతారు జనాలు. అయితే ఈ సంక్రాంతి అనుకున్నంత లేదనే చెప్పాలి. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఏవి పెద్దగా విజయం సాధించలేదు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, బాలకృష్ణ నటించిన కథానాయకుడు, వెంకీ నటించిన ఎఫ్ 2 సినిమా ఈ సంక్రాంతికి విడుదలైయ్యాయి. రామ్ చరణ్ వినయ విధేయ రామ, బాలకృష్ణ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర ఘెరంగా ఫెయిల్ అయ్యాయి. వెంకీ ,వరుణ్ తేజల ఎఫ్ 2 మాత్రం ఫర్వాలేదనిపించుకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. సినిమా మొదటి భాగం బాగుందని టాక్ వచ్చింది. ఫుల్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంలో విజయం సాధించింది. ఇక సంక్రాంతికి విడుదలైన సినిమాలలో కలెక్షన్లు ఈ సినిమాకే ఎక్కువుగా వచ్చినట్లు తెలుస్తోంది.దాదాపు అన్ని ఏరియాల్లో ఈ కామెడీ ఎంటర్టైనర్ మంచి లాభాలను అందిస్తోంది. దీంతో థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.మొదటివారం కలెక్షన్స్ స్ట్రాంగ్ గా రావడంతో ఇప్పుడు 50 కోట్లకు పైగా షేర్స్ వచ్చే అవకాశం ఉంది.
- లోకేష్ రాజీనామా చేయాల్సిందే: రోజా
- మా ఆయనకు మతి చెడింది.. గోవిందా భార్య కీలక వ్యాఖ్యలు!
- ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అరెస్ట్!
- ‘ఇరుముడి’.. కథ చెప్పేసిన దర్శకుడు!
- ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నారా?
