Saturday, April 27, 2024
- Advertisement -

శ్రీరెడ్డి సూపర్ షాక్…… నానీ అడ్డంగా బుక్కయ్యాడు

- Advertisement -

నేచురల్ స్టార్ నానీ అడ్డంగా బుక్కయ్యాడు. శ్రీరెడ్డి తెలివితేటల ముందు ఫ్లాట్ అయ్యాడు. బిగ్ బాస్‌ని మించిన గేంని బయటే చూపించడం మొదలెట్టింది శ్రీరెడ్డి. ఇప్పటికే సురేష్ బాబు కొడుకుతో సహా చాలా మందిని సీన్‌లోకి లాగిన శ్రీరెడ్డి ఇప్పుడు నానీని కూడా పూర్తిగా టార్గెట్ చేసేలానే కనిపిస్తోంది. అయితే రీసెంట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్‌లో శ్రీరెడ్డి మాటలకు ఎవరూ స్పందించవద్దని నిర్ణయం తీసుకున్నారు. టివి కెమేరాల ముందు కూడా శ్రీరెడ్డి గురించి ఏమీ మాట్లాడవద్దని ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మధ్య శేఖర్ కమ్ముల కూడా శ్రీరెడ్డి విషయంలో అనవసరంగా స్పందించి ఇంకాస్త డ్యామేజ్ కొనితెచ్చుకున్నాడు. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం శ్రీరెడ్డి విషయంలో సైలెంట్‌గా ఉంటేనే బెటర్ అని నిర్ణయించుకుంది.

అయితే యువ హీరో నానీ మాత్రం అనవసరంగా ఆవేశపడిపోయాడు. అది కూడా బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించే ప్రయత్నం మొదలెట్టగానే శ్రీరెడ్డి వర్సెస్ నానీ షోని మొదలెట్టే అవకాశం శ్రీరెడ్డికి ఇచ్చాడు. అసలే బిగ్ బాస్‌లో తనకు ఎంట్రీ లేదని ఫీలవుతున్న శ్రీరెడ్డి ఇప్పుడిక బిగ్ బాస్ షోని మించిన గేంని బయటే చూపిస్తుందనడంలో సందేహం లేదు. నానీని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో రెచ్చిపోనుంది. శ్రీరెడ్డి మాటలకు నానీ మళ్ళీ మళ్ళీ స్పందించే పరిస్థితి ఉండదు. అలా స్పందిస్తే శ్రీరెడ్డికే క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. అందుకే పరిణామాలను పరిశీలిస్తున్న ఇండస్ట్రీ జనాలు మాత్రం శ్రీరెడ్డి ట్రాప్‌లో నానీ అనవసరంగా ఇరుక్కుపోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు. లీగల్‌గా ఇప్పటికే శేఖర్ కమ్ముల ఫైట్ చేస్తున్నాడు. ఏళ్ళూ పూళ్ళూ పట్టే ఆ ప్రాసెస్‌లో నానీ ఏమైనా శ్రీరెడ్డిని కార్నర్‌ని చేయగలడా అన్న సందేహాలను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -