Wednesday, May 1, 2024
- Advertisement -

సప్తగిరి మొదటి రోజు వసూళ్లు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది

- Advertisement -
Sapthagiri Express Day 1 Collections

సప్తగిరి కి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉందండోయ్ .. ఇండస్ట్రీ కి ఈ విషయం చాలా లేటుగా తెలిసినట్టు ఉంది. హీరోగా అతని మొదటి సినిమా ఏకంగా రెండున్నర కోట్లకి దగ్గర దగ్గర కలక్ట్ చెయ్యడమే షాకింగ్ గా ఉంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2.35 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది అని స్వయంగా ఈ సినిమా నిర్మాత రవికిరణ్ ప్రకటించాడు. ఇది నిజమేనా అంటున్నారు అందరూ. నిజమైతే మాత్రం సప్తగిరి సునీల్ కంటే పెద్ద హీరో అయ్యే ఛాన్స్ ఉంది మరి.

‘వంగవీటి’తో పాటు నాలుగు సినిమాలతో పోటీ పడి రిలీజైంది ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’. అయినప్పటికీ ఈ చిత్రానికి 300 దాకా థియేటర్లు దక్కడం విశేషమే. పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు అతిథిగా రావడం.. ట్రైలర్ అదీ చూస్తే మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ లాగా కనిపించడంతో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ థియేటర్లు తొలి రోజు జనాలతో కిటకిటలాడాయి. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డట్లు సమాచారం. సప్తగిరి సొంత జిల్లా చిత్తూరులో అయితే కొన్ని చోట్ల బ్లాక్ లో టికెట్లు అమ్మే పరిస్థితి వచ్చింది.

రివ్యూలు నెగెటివ్ గా ఉన్నప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీకెండ్ వసూళ్లు అంచనాల్ని మించి వచ్చేట్లున్నాయి. ఈ సినిమాపై నిర్మాత రూ.6 కోట్ల దాకా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. సినిమాను అతను సొంతంగా రిలీజ్ చేసుకోవడం విశేషం. ఓపెనింగ్స్ చూస్తుంటే అతను సేఫ్ జోన్లోకి వచ్చేసేలాగే ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -