Friday, May 17, 2024
- Advertisement -

నిహారిక, బాల‌య్య కొడుకు అప్పుడే ఫిక్స్ అయ్యారు..

- Advertisement -
shocking news on niharika and mokshagna

ఇండ‌స్ట్రీలోకి రావాలి.. వచ్చి స్టార్స్ గా ఎదగాలి.. అని సినిమా ప్ర‌పంచంలో పుట్టి, రంగుల క‌ళ‌ను క‌ళ్ల‌కు అద్దుకున్న మెగా డాట‌ర్ నిహారిక‌, నంద‌మూరి వంశాంకురం మోక్ష‌జ్ఞ చెపుతున్న మాట‌లు. వాస్తవానికి ఈ మాటలు ఇప్పుడు చెప్పుతున్నవి కావంట.. చిన్న‌త‌నంలోనే వారి మ‌న‌సులో బ‌లంగా ముద్రించుకున్న‌వ‌ట‌. అయితే ఇప్పుడు వీరిద్దరికి లింక్ ఏంటి అనుకుంటున్నారా.. ఉందండి.. మెగా డాట‌ర్ నిహారిక‌, నంద‌మూరి మోక్ష‌జ్ఞ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.

అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రతీ ఒక్కరు చిన్నతనంలో ఇంజ‌నీర్ అవ్వాలి, డాక్ట‌ర్ అవ్వాలనే కలలు కనటం మాములే. అయితే సినీ కుటుంబంకి చెందిన ఈ ఇద్ద‌రూ మాత్రం ఖచ్చితంగా చిత్ర ప్రపంచంలోనే అడుగుపెట్టాలని అప్ప‌ట్లోనే ఫిక్స్ అయ్యార‌ట‌. సినిమా అంటే ఎంత‌టి రిస్కో తెలియ‌నిది కాదు. ఒక్క ఫ్లాప్ ప‌డితే చాలు, జీవితం త‌ల‌కిందులు అయిపోతుంది. అటువంటి రిస్క్‌ను కూడా ఛాలెంజింగ్‌గా తీసుకోవాల‌న్న‌ది వీరిద్ద‌రి ఉద్దేశ‌మ‌ట‌.

అందుకే నంద‌మూరి అంద‌గాడు బాలకృష్ణ 100వ సినిమాతో మోక్ష‌జ్ఞ గ్రాండ్ ఎంట్రీ అవ్వాల‌ని చూసాడు.. కానీ అది కుదరలేదు. ఇక నిహారిక ఒక మ‌న‌సు సినిమాతో ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కాకపోయిన నిహారిక యాక్టింగ్‌కి మాత్రం మంచి మార్కులు ప‌డ్డాయి. మ‌రి అనుకున్న‌దే త‌డ‌వుగా ఇండ‌స్ట్రీ ఎంట్రీలు ప్లాన్ చేసుకున్న ఈ ఫ్రెండ్స్‌, ఒకే సినిమాలో క‌నిపించే ప్ర‌య‌త్నం చేస్తారో లేదో చూడాలి.

Related

  1. ‘మొదటి పెళ్లి చూపులు’ తో ఊహించని షాక్ ఇచ్చిన నిహారిక!
  2. అయ్యో నిహారిక.. మళ్లీ అదే పనా?
  3. ఒక మనసు దెబ్బ గట్టిగానే తగిలింది నిహారికకు!
  4. బాల‌య్య తో మహేష్ సినిమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -