Friday, April 26, 2024
- Advertisement -

నటుడు, దర్శకులు ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు కన్నుమూత.. పలువురు సినీ ప్రముఖుల సంతాపం!

- Advertisement -

సీనీ ప్రపంచంలో మరో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు, నటుడు ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు(79) కన్నుమూశారు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆంజనేయులు శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

ఆయనకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఆయన దర్శకత్వ శాఖలో కృష్ణ, విజయనిర్మల, వి.రామచంద్రరావు, కె.హేమాంబదరరావు, కె.ఎస్,ఆర్.దాస్ తదితరుల దగ్గర పలు చిత్రాలకు పనిచేశారు.

అనంతరం ‘కన్నెవయసు’, ‘లవ్ ఇన్ సింగపూర్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘లవ్ ఇన్ సింగపూర్’ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -