Thursday, May 2, 2024
- Advertisement -

ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ భావోద్వేగం!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా నెరవేరుస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొమరగిరి మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. క్రిస్మస్‌, వైకుంఠ ఏకాదశి ఒకే రాజు కలిసి రావడం అరుదైన సందర్భమని, ఇలాంటి రోజున 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు  సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

అయితే పులివెందులలో ఇళ్ల పట్టాలు పంచలేకపోతున్నందుకు మనసులో చాలా బాధగా ఉందని అన్నారు సీఎం.  ఇళ్ల పట్టాలు రెడీగా ఉన్నా..దీనిపై ఎవరో కోర్ట్‌కి వెళ్లి స్టే తీసుకురావడంతో పంపిణీ చేయలేకపోతున్నానని చెప్పారు. సుప్రీం కోర్టుకు వెళ్లయినా సరే త్వరలోనే పులివెందులలో కూడా ఇళ్ల పట్టాలు పంచుతామన్నారు. తాము కడుతున్నది ఇళ్లను కాదని… ఏకంగా గ్రామాలనే నిర్మిస్తున్నామని జగన్ చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 17,500 వైయస్సార్ జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేసేందుకు అనుక్షణం కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి రూపాయికే 300 చదరపు గజాల భూమి అందచేయనున్నారు. తాము అందిస్తున్న ప్లాటు విలువ రూ. 4 లక్షలు ఉంటుందని చెప్పారు.

వైసీపీకి ఓటు వేయని వారికి కూడా ఇంటిని అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ఎల్ఈడీ లైట్లతో పాటు ఇంటి పైన ఒక సింటెక్స్ ట్యాంక్ ఉంటుందని చెప్పారు. పేదవారికి ఇళ్ల పట్టాలు పంచడం తనకు ఎంతో సంతోషంగా ఉందని.. ప్రతి పేదవాడు సొంతింటి కల నెరవేర్చాలనేది తన లక్ష్యం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -