ఈ మధ్య సినీ ఆర్టిస్ట్‌ల ఆత్మహత్యలు ఎక్కువైయ్యాయని చెప్పాలి. తాజాగా మరోనటి ఆత్మహత్య చేసుకుంది. సీరియల్ నటి ఝాన్సీ ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్‌లో ఝాన్సీ ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఆమె తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆమె డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మరణానికి కారణం ఇష్టంలేని అని తెలుస్తోంది. ఝాన్సీ ఓ వ్యక్తిని ప్రేమించిందని సమాచారం. కాని ఇంట్లో ప్రేమ వివాహానికి నిరాకరించడంతోనే, ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంట్లో వేరే పెళ్లి చూడటంతోనే ఆమె ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఝాన్సీ తన ఇంట్లో ఫ్యానుకు ఊరి వేసుకుని చనిపోయింది. ఝాన్సీ స్వస్థలం కృష్ణాజిల్లా వడాలి అని తెలుస్తోంది. ఘాన్సి పూర్తి పేరు నాగ ఝాన్సీ. ఝాన్సీకి ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పలు సీరియల్స్‌లో నటిస్తు మంచి పేరు తెచ్చుకుంది. ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా ఝాన్సీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమె మృతిపట్ల పలువురు సీరియల్ నటులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?