Friday, May 3, 2024
- Advertisement -

సినిమా వాళ్ల క‌న్నా ఎక్కువ సంపాదిస్తున్న‌ సీరియ‌ల్ న‌టి

- Advertisement -

ప్ర‌స్తుతం సినిమా హీరో, హీరోయిన్స్‌తో స‌మానంగా సీరియల్ న‌టీ,న‌టులే బాగా ఫేమ‌స్ అవుతున్నారు.ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్ల క‌న్నా ఇప్పుడు సీరియ‌ల్స్‌లో న‌టించే వారికే మంచి గుర్తింపు ఉంది.థియోట‌ర్ల‌లో సినిమా చూసే వారి సంఖ్య త‌గ్గిపోవ‌డంతో చాలామంది సీరియ‌ల్స్ మీద ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.ఇక సీరియ‌ల్స్‌లో న‌టించే వారి పారితోష‌కాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి.ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి హ‌రిత ప‌లు సినిమాల‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ త‌రువాత సీరియ‌ల్స్‌లో న‌టిస్తు ఫుల్ బిజీగా మారింది.బుల్లితెర మీద ఇంత బిజీ ఆర్టిస్ట్ మ‌రోక‌రు లేరంటే అతిశేయోక్తి కాదు.ప్ర‌ముఖ ఛానెల్స్‌లో వ‌చ్చే ప్ర‌తి సీరియ‌ల్‌లో న‌టిస్తు రెండు చేతుల సంపాదిస్తుంది హ‌రిత‌.

ముద్ద మందారం,కుంకుమ పువ్వు,క‌ల‌వారి కోడ‌లు వంటి సీరియ‌ల్స్‌లో న‌టిస్తుంది హ‌రిత‌.సినిమాల‌లో న‌టించే హీరోయిన్ల క‌న్నా ఎక్కువ ఈమెను సంపాదిస్తుందని స‌మాచారం.చూడచక్క‌ని అందం,నిండైన ముఖం,అచ్చ తెలుగామ్మాయి ఎలా ఉండాలో అలా ఉండ‌టం హ‌రిత‌కు ప్ల‌స్ పాయింట్.వీటి ద్వారానే ఆమె ప‌లు సీరియ‌ల్స్‌లో ఛాన్స్‌లు కొట్టేస్తుంది.ఇక ఆమె వ్యక్తిగ‌త జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంది.న‌టుడు జాకీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.జాకీ కూడా ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్నాడు.వీరికి ఇద్ద‌రు సంతానం.ఇక హ‌రిత ఒక‌ప్పుడు హీరోయిన్ ర‌వ‌ళికి సోద‌రి అన్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు.ర‌వళి ద్వారానే హ‌రిత ఇండ‌స్ట్రీకి ప‌రిచియం అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -