బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం కింగ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆయన త్వరలో ఒక భారీ బడ్జెట్ రొమాంటిక్ డ్రామాలో నటించే అవకాశం ఉందట.
ఇది ఆయన గత సినిమాల మాదిరిగా కాకుండా, వయసుకు తగ్గ, భావోద్వేగాలతో నిండిన కథగా ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
ఈ కథ పాత తరహా ప్రేమ కథల మాదిరిగా ఉండినా, మరింత పరిపక్వతతో, భావోద్వేగాలతో నిండిన కథగా ఉంటుందని సమాచారం. ఇది ఆయన గతంలో చేసిన రొమాంటిక్ పాత్రల రీ-హాష్ కాకుండా, వయస్సుకు తగ్గట్టుగా, లోతైన భావోద్వేగాలతో కూడిన కథగా రూపొందించబడుతుందని తెలుస్తోంది. ఈ కథ షారుక్‌కు ఎంతో నచ్చిందని, ఆయన దీన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారని టాక్.
అలాగే ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ కూడా షారుక్‌కు ఒక కథ వినిపించినట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్‌లలో ఏదిని ముందుగా ఎంపిక చేసుకుంటాడో చూడాలి.
