Sunday, May 12, 2024
- Advertisement -

షారూఖ్ తో రొమాన్స్ కి రెడీ అవుతున్న అలియా భట్

- Advertisement -

కి౦గ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కన్నా వయస్సులో చాలా చిన్నది అయిన ముఖేష్ భట్  కూతురు అలియా భట్ తో రోమాన్స్ చేయటానికి త్వరలోనే సిద్దం అవుతున్నట్టు సమాచారం.

ఇప్పటివరకు తన కంటే చిన్నవారైన దీపిక, అనుష్క శర్మ వంటి వారితో రోమాన్స్ చేసాడు షారుక్. అయితే వీరి మధ్య వయస్సు తేడా 15 ను౦డి 20

సంవత్సరాల వరకు ఉంటుంది.

అయితే ఇప్పుడు అలియా భట్ షారూఖ్ కన్నా 28 సంవత్సరాలు చిన్నది. గౌరీ శి౦డే అనే దర్శకురాలు ఈ చిన్నదాన్ని షారుక్ కోసం సెలక్ట్ చేసిందని సమాచారం. పా సినిమా దర్శకుడు ఆర్.భల్కీ భార్యగా,శ్రీదేవికి ‘ఇ౦గ్లీష్ వి౦గ్లీష్’ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన దర్శకురాలిగా గౌరీ శి౦డే బాగా ఫేమస్ అయ్యింది. ఇమే  ‘ఇ౦గ్లీష్ వి౦గ్లీష్’ విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అయ్యిన తర్వాత తన కొత్త సినిమాని ప్రారంభించటానికి సన్నాహాలను చేస్తుంది.

ఈ సినిమాలో షారుక్ కి జోడిగా అలియా భట్ ని ఎంపిక చేసినందుకు అలియా గౌరీ శి౦డే కి ధన్యవాదాలు తెలిపింది. కింగ్ ఖాన్ తో నటిస్తున్నాను నా జీవితంలో నాకు ఇంకా ఏమి కావాలి అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది అలియా భట్. ప్రస్తుతం షారుక్ దిల్ వాలే, ఫాన్ మరియు రేఇస్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు అన్ని పూర్తి అయ్యాక గౌరీ శి౦డే దర్శకత్వంలో సినిమా చేస్తాడని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -