- Advertisement -

24 గంటల పాటు ముద్దులతోనే గడిపేసిన హీరో,హీరోయిన్లు!

- Advertisement -

కంగనా రనౌత్.. జాతీయ అవార్డులు సొంతం చేసుకొన్న నటి. అయితే ఇలా అవార్డెడ్ హీరోయిన్లే చాలా మంది బాలీవుడ్ లో రెచ్చిపోయి నటిస్తూ ఉంటారు. డర్టీ పిక్చర్ లో విద్యాబాలన్ ను చూశాం కదా…

మరి ఇప్పుడు కంగనా కూడా అంతకు మించిన డర్టీగా కనిపిస్తోంది. ఈమె ఏకంగా ఒక పాట చిత్రీకరణ కోసం ఏకంగా 24 గంటల పాటు ఒక హీరోతో ముద్దుల్లో గడిపేసింది. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమా కోసం చిత్రీకరిస్తున్న పాటలో కంగనా.. హీరో ఇమ్రాన్ ఖాన్ ల మధ్య ఒక లిప్ కిస్ చిత్రీకరణ ఉందట. 

దానిలో పర్ఫెక్షన్ కోసం అంటూ ఏకంగా మూడు రోజుల పాటు చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. ఆ మూడు రోజుల్లో కంగనా, ఇమ్రాన్ లు దాదాపుగా 24 గంటల సేపు ముద్దుల్లో మునిగి తేలినట్టు సమాచారం. ఇదంతా చిత్రీకరణ కోసమే సుమా. అయినా ఈ మధ్య సినిమాల్లో లిప్ కిస్సుల గురించి పరిశోధనలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆ మధ్య దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సినిమా ‘హార్ట్ అటాక్’ విషయంలో కూడా ఏదో గంట సేపు ముద్దో… ఏదో చూపించాడు.

అలాగే తమిళంలో ఒక “త్రిష లేదా నయనతార” సినిమా విషయంలో హీరో,హీరోయిన్ల మధ్య లిప్ లాక్ కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్ వంతు వచ్చింది. మరి సినిమాలకు విడుదల ముందు ప్రచార ఎత్తుగడలకు ఇలాంటి ముద్దు ముచ్చట్లు బాగానే ఉపయోగపడతాయేమో!

 

{youtube}4eX9J2mijzk{/Youtube}

{youtube}bWntQlV2J7Q{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -