Monday, May 20, 2024
- Advertisement -

షారుఖ్‌..డంకీ ఓటీటీలోకి!

- Advertisement -

గతేడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డంకీ. ప్రభాస్ సలార్‌తో పోటీ పడుతూ వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించగా తాప్సీ, విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని ఎదరుచూస్తున్న వారికి మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నిన్న అర్థరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే డంకీ కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.

లండన్ వెళ్లి బాగా బతకాలనుకొనే కొంతమంది వీసా రిజెక్ట్ అవ్వడంతో అడ్డదారిలో దేశాలు దాటుతూ ఎలా వెళ్లారు? వెళ్లే మార్గంలో ఎన్ని కష్టాలు పడ్డారు? వెళ్ళాక ఏమైంది అనే కథతో తెరకెక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -