Thursday, May 16, 2024
- Advertisement -

ఆ సీన్స్‌లో న‌టించ‌డం చాలా సిగ్గు అంటున్న‌ శీల‌వ‌తి

- Advertisement -

శృంగార తార‌గా చెప్ప‌క‌పోయినా దానికి కొంచెం దగ్గ‌ర‌లో ఉండే సినిమాలు చేస్తూ వ‌చ్చిన న‌టి శ‌కీలా. ఆమె దాదాపు 250 సినిమాలు చేశారు. ఇప్పుడు మ‌రో సినిమా శీల‌వ‌తితో ప్రేక్ష‌ కుల ముందుకు వ‌స్తున్నారు. ఆమె అప్ప‌టికీ మాదిరే ఇప్ప‌టికీ ఉంది. ప్ర‌స్తుతం శీల‌వ‌తి సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు.

తాను సింగిల్ టేక్‌లో సీన్‌కు ఒకే చెప్పేస్తాన‌ని తెలిపింది. తన కెరీర్ లో ఏ రోజూ సెకండ్ టేక్ తీసుకున్నది లేదని శ‌కీలా తెలిపింది. కావాలంటే.. ఈ విష‌యం తన దర్శకుల్ని అడిగితే చెబుతారని చెప్పింది. అయితే సెకండ్ టేక్ తీసుకోకపోవడానికి ఒక‌ కారణం ఉందంట‌. ఆ కార‌ణం వెన‌క ఎంతో ఆర్ధ్ర‌త దాగి ఉంది. ఆమె చెప్పిన కారణం వింటే అయ్యో అంటాం. సెకండ్ టేక్ తీసుకోవ‌డం అంటే మ‌ళ్లీ అలాంటి సినిమాలు చేయ‌డం అని.. మ‌ళ్లీ అలాంటి సీన్ చేయ‌లేక‌పోవ‌డ‌మే సెకండ్ టేక్ తీసుకోక‌పోవ‌డానికి కార‌ణం చెప్పింది.

శృంగార సన్నివేశాలు చేస్తుండడం బిడియంగా ఉండదా? అని అడుగుతారు. అయితే ఈ ప్ర‌శ్న‌కు నిజం చెబితే నమ్మరేమో. చ‌.. నిజమా? అని అంటారేమో కానీ.. నిజంగానే ఇప్పటికీ శరీరాన్ని ప్రదర్శించేలా నటించడం సిగ్గు అని.. తెలిపింది. శరీరాన్ని ప్రదర్శించాలని ఏ ఆడదీ అనుకోదు. నా దురదృష్టమేమో.. నాకన్నీ అలాంటి చాన్సులే వచ్చాయి.

అందుకే ఆ సీన్స్ చేయ‌డానికి తాను సెకండ్ టేక్ తీసుకోను అని చెప్పింది. ఒకేసారితో సీన్ బాగా చేసేస్తే ఆ సీన్ పీడ వదిలిపోతుందనే ఉద్దేశంతో సింగిల్ టేక్‌కు ఓకే చెప్పేస్తాన‌ని వివ‌రించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -