Thursday, May 2, 2024
- Advertisement -

9 కిలోల బ‌రువు త‌గ్గిన హీరోయిన్‌.. ఎందుకంటే?

- Advertisement -

చిన్న సినిమాలు చేస్తూ అందం.. న‌ట‌న‌తో ఆక‌ట్టుకోవ‌డంతో స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించే అవ‌కాశం తొంద‌ర‌లోనే వ‌చ్చేసింది. ఇంకేముంది వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో సినిమాలు చేసేసి ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ ప‌రాభ‌వం ఎదుర‌వడంతో తిరిగి తెలుగుకు వ‌చ్చేసిన హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

రకుల్‌ ప్రీత్ సింగ్ ప్రతి సినిమాలో చాలా అందంగా కనిపించేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ హీరోయిన్ 9 కిలోల బ‌రువు త‌గ్గింది. కొన్ని రోజులుగా రకుల్ ఎక్కువగా జిమ్‌లో గడుపుతుండ‌డంతో బ‌రువు త‌గ్గేసింది. ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగించ‌డానికి క‌స‌ర‌త్తులు చేస్తోంది. అందులో భాగంగా దాదాపు 9 కిలోల బరువు తగ్గిందట. ఇటీవ‌ల బాలీవుడ్‌లో ‘అయ్యారి’ సినిమాతో ఫ్లాపు మూట‌గ‌ట్టుకొని వ‌చ్చిన ర‌కుల్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్ సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

అయితే ఈ బ‌రువు త‌గ్గ‌డానికి రకుల్ శిక్ష‌ణ తీసుకుంది మాత్రం రానా ఫెవేరేట్ జిమ్ ట్రైనర్ కునాల్ గిర్ వ‌ద్ద‌. కునాల్ బాహుబలి సినిమా కోసం ప్ర‌భాస్‌, రానాల‌ను భారీగా తయారుచేసిన విష‌యం తెలిసిందే. రకుల్ కూడా తొందరగా అందాలను మార్చాలని శిక్ష‌ణ పొందుతోంది.

అయితే ఈ ప్ర‌త్యేక క‌స‌ర‌త్తులు బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సినిమా కోస‌మ‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -