గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు తెరపడింది. యంగ్ హీరోతో స్టార్ హీరోయిన్ సమంత నటించనుందని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తు ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు నిర్మాత దిల్ రాజు. తమిళంలో గత ఏడాది పెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచిన 96. విజయ్ సేతుపతి, త్రిష హీరో, హీరోయిన్లగా నటించిన ఈ సినిమ తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు.
ఈ సినిమాలో హీరో, హీరోయిన్లగా శర్వానంద్, సమంతలను ఫైనల్ చేశాడు దిల్ రాజు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు దిల్ రాజు. ఇప్పటి వరకు యంగ్ హీరోయిన్స్‌తో తప్ప స్టార్ హీరోయిన్స్‌తో నటించలేదు శర్వా. ఫస్ట్ టైమ్ స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి నటిస్తున్నాడు. ఇటీవల కాలంలో శర్వా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. దీంతో ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి రేస్‌లో నిలవాలని భావిస్తున్నాడు శర్వానంద్. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!