- Advertisement -

శర్వానంద్ ‘బైకర్’కు సెన్సార్ ఫిదా!

- Advertisement -

శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. భారతదేశంలో తొలి మోటోక్రాస్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.

దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ నిర్మించింది. ఈ సినిమా రేపే థియేటర్లలో విడుదల కానుంది. మాళవికా నాయర్, రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తుండగా డాల్బీ సినిమాతో పాటు పలు ప్రీమియం ఫార్మాట్స్‌లో విడుదల కానుంది:

విజువల్ & సౌండ్ అనుభవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. సినిమా మొత్తం నిడివి 2 గంటలు 35 నిమిషాలు కాగా అద్భుతంగా వచ్చిందని బోర్డు సభ్యులు కితాబు ఇచ్చినట్లు తెలుస్తోంది.

శర్వానంద్ నటన ప్రత్యేక ఆకర్షణ కాగా రాజశేఖర్ పాత్ర ,ఫస్ట్ హాఫ్‌లో క్లిఫ్ జంప్ సీన్ హైలైట్‌గా ఉందని తెలిపారుఉ. అలాగే టెక్నికల్ వర్క్ అద్భుతంగా ఉందని.. సెకండ్ హాఫ్ ఎమోషన్ బాగుందని తెలిపినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. బైకర్ పాజిటివ్ బజ్ మధ్య విడుదలవుతుండగా, థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -