- Advertisement -

పెద్ది..హనుమాన్ జయంతి స్పెషల్

- Advertisement -

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి రామ్ చరణ్ ‘పెద్ది’. సినిమా ఆలస్యమవుతుందనే వార్తలు వచ్చినప్పటికీ, ఏప్రిల్ 30, 2026న విడుదలకు సిద్ధంగా ఉందని రామ్ చరణ్ ఇప్పటికే స్పష్టం చేశారు.

దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ కథగా రూపొందుతోంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.
హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. “Peddi Pehelwan” గ్లింప్స్ ఆధారంగా రూపొందించిన ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు.

భగవాన్ హనుమంతుడిని గుర్తు చేసేలా బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా ఆయన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -