Saturday, May 4, 2024
- Advertisement -

పంతం నెగ్గించుకున్న తేజ….. వెనక్కి తగ్గిన బాలయ్య…. యంగ్ ఎన్టీఆర్‌గా ఆ హీరో

- Advertisement -

మేరునగధీరుడిలా ఎదిగిన ఎన్టీఆర్‌కి సొంత కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడూ కలిసి వచ్చినట్టుగా కనిపించదు. కొడుకులు, అల్లుల్లు, కూతుర్లు కూడా ఎన్టీఆర్ కంటే వ్యక్తిగత స్వార్థాలకే ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం నాటకాన్ని చంద్రబాబు ముందుండి నడిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ చుట్టూ కూడా అలాంటి రాజకీయాలే నడుస్తున్నాయని తెలుస్తోంది. బాలయ్యపై టెస్ట్ షూట్ చేసిన తేజ…..యంగ్ ఎన్టీఆర్‌గా బాలయ్య సూట్ కాట్లేదని స్ట్రెయిట్‌గా చెప్పేశాడు. తారక్ అయితే బాగుంటుందని చెప్పాడు. నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నందమూరి అభిమానులు, ఆ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని చూడాలనుకుంటున్నారు.

కానీ నారా వారి కుటుంబం నుంచి మాత్రం ఈ ప్రపోజల్‌పై పూర్తి వ్యతిరేకత వస్తుందని తెలుస్తోంది. ఎప్పటికైనా నారా లోకేష్‌కి ఎన్టీఆర్ పోటీ అవుతాడని …….ఆ నేపథ్యంలో ఎన్టీఆర్ పాత్రలో తారక్ నటిస్తే ఆ ఎన్టీఆర్ నేం, ఫేం అంతా కూడా తారక్‌కే వెళ్ళే అవకాశం ఉందని నారా చంద్రబాబు, లోకేష్‌ల భయం. ఎన్టీఆర్‌కి కూడా తాత రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టాలన్న అభిలాష బలంగా ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ బయోపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించకూడదు అన్నది నారా వారి స్ట్రిక్ట్ కండిషన్. బాలయ్య కూడా ఆ ప్రపోజల్‌కి వెంటనే ఒకే చెప్పేశాడట. అందుకే ఇప్పుడు యంగ్ ఎన్టీఆర్ పాత్రకోసం శర్వానంద్‌ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా తెరకెక్కుతున్న ఈ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం పూర్తిగాా చంద్రబాబునాయుడు దృక్కోణంలోంచే ఉంటుందని ముందునుంచీ తెలిసిన విషయమే. ఇప్పుడు తాజా పరిణామాలతో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. అయితే ఆ స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజకీయ స్వార్థం కోసం కాకుండా ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తెరకెక్కించేలా బాలయ్య ప్రయత్నాలు ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -