Friday, May 9, 2025
- Advertisement -

నన్ను అత‌ను ప్రేమించిన‌ట్లు న‌టించాడు..!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌రువాత ఆమె పెద్దగా సినిమాల‌లో క‌నిపించ‌లేదు.ఇదే స‌మ‌యంలో పలు రియాల్టీ షోల‌కు జ‌డ్డిగా వ్య‌వ‌హ‌రిస్తుంది శిల్పాశెట్టి.హియర్ మి లవ్ మి అనే షోలో మాట్లాడుతూ త‌న జీవితంలో జ‌రిగిన మొద‌టి ప్రేమ‌ను గుర్తు చేసుకుంది. ఓ అబ్బాయి రోజు సాయంత్రం మా ఇంటికి ఫోన్ చేసేవాడు. అప్పుడు నేను ఇంకా కాలేజ్ లో చదువుకుంటున్నాను.

ఆ వయసులో ఏ అమ్మాయైనా.. ఎట్రాక్ట్ అవుతుంది. నా పరిస్థితి కూడా అంతే.. అప్పుడు కేవలం ల్యాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి.. అతడి ఫోన్ కోసం ఎదురు చూసేదాన్ని.ఆ అబ్బాయి తన పేరు కూడా నాకు చెప్పలేదు. ఒకరోజు బస్ స్టాప్ లో కలుద్దామని చెప్పాను. కానీ తను అక్కడకి రాలేదు. దీంతో అతడితో రిలేషన్ కి గుడ్ బై చెప్పాలనుకున్నాను. త‌రువాత తెలిసింది ఆ అబ్బాయి త‌న‌ను ప్రేమించ‌లేద‌ని,నా ఫ్రెండ్స్ తో బెట్ కట్టి నాతో ప్రేమ నాటకమాడాడని తెలిసి చాలా బాధ ప‌డ్డాను అంటూ త‌న మొద‌టి ప్రేమ క‌థ‌ను చెప్పుకొచ్చింది ఈ పొడుగు కాళ్ల సుంద‌రి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -