హీరో శివాజీ.. సినిమాలు తీసెట్టప్పుడు కూడా ఆయనకు అంత ఫేమ్ లేదు. కానీ ఏపీలో 2019 ఎన్నికల ముందు ఆయన చేసిన పలు వ్యాఖలు ఎందరినో ఆలోచింపచేశాయి. ఆ సమయంలో ఆపరేషన్ గరుడ వేగ అంటూ ఆయన ఒక విషయాలన్ని ఎంతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆయన గళం విప్పాడు.
దాంతో ఆయన ప్రజలకు ఎంతో దగ్గరయ్యాడు. కానీ ఎమైందో ఎమో కానీ.. శివాజీ ఎందుకనో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్చల్లో ఆయన పాల్గొని పలు ప్రశ్నలను లేవనెత్తి జనాలను ఆలోచించేలా చేస్తున్నాడు.
అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నామో.. వారు మాత్రం ఇలాంటివి వినరని గట్టిగానే ఫైర్ అయ్యాడు. అలాగే.. యాంకర్ సుమ కుక్క పిల్లతో ఆడుకుంది, యాంకర్ అనసూయ అందాల ఆరబోత లాంటి వీడియోస్ యూట్యూబ్ లో పెడితే.. 4 మిలియన్ల వ్యూస్ వస్తాయ్. కానీ జనం కోసం ఏదో చేద్దామని వీడియో చేస్తే.. ఎవరు చూడరని మండి పడ్డాడు. ఇది ఎంతో బాధకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇద్దరమ్మాయిల ముద్దుల పెళ్లి.. షాకైన ఇరు కుటుంబ సభ్యులు!
వర్మను కలిసిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ!