Tuesday, April 30, 2024
- Advertisement -

వ‌ర్మను క‌లిసిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ!

- Advertisement -

అరియానా.. ఐ యామ్ హాట్ అంటూ బిగ్ బాస్ తో కుర్ర‌కారును హీట్ ఎక్కించిన యాంక‌ర్. ఈ ముద్దుగుమ్మ గురించి త‌ను బిగ్ బాస్ లోకి పోయే వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌ని పేరు. కానీ బిగ్ బాస్ లోని అడుగు పెట్టిన త‌ర్వాత అంద‌రికి ఇష్ట‌మైన కంటస్టెంట్ ఈ చిన్న‌ది. అయితే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లోకి వెళ్ల‌డానికి కార‌ణం మాత్రం ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మే కార‌ణం అని చెప్పాలి.

ఎందుకంటే గతంలో వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ నేటికి ట్రెండింగ్ లో ఉంటుంది. అందులో అరియాన వ‌ర్మ‌ని.. ఏ అమ్మాయిని చూస్తే మీకు వావ్ అనిపిస్తుంది అని అడ‌గ్గానే.. నువ్వే.. అంటూ వ‌ర్మ అరియాన‌కు షాకిచ్చాడు. అలాగే నిన్ను బికినీలో చూడాలని ఉందని ప‌లు సంచలన కామెంట్ చేశాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక దాంతో అరియానా ఒక్కసారిగా ఫేమ‌స్ అయ్యింది. దాంతో ఆమె బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. అక్క‌డ కూడా అరియానా త‌న చేస్ట‌ల‌తో ప్రేక్షకులను కట్టి పడేసింది. దీంతో చివరకు నాలుగో స్థానంతో నిలిచింది. కాగా తాజాగా వర్మను అరియానా కలిసింది. అది ఎక్కడో కాదు.. టూర్టిస్ట్ డెస్టినేషన్ అయిన‌ గోవాలో. విష్ణుప్రియ, అవినాశ్ తో పాటు గోవాకు వెళ్లిన‌ అరియానా.. పనిలో పనిగా అక్కడే ఉన్న వర్మను క‌లిసింది. ఈ సందర్భంగా వర్మతో దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా నాతో విలువైన సమయం గడిపినందుకు థాంక్యూ సార్ అంటూ క్యాప్ష‌న్ పెట్టింది.

పాపం ఈ అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ దానిపైనే..

ర‌ష్మికకు ఇలాంటి వీడియోలు చేయ‌డం మొద‌టిసార‌ట‌‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -