Friday, April 26, 2024
- Advertisement -

పవర్ స్టార్ అభిమానులకు షాక్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్. తనకు అభిమానులు ఇచ్చిన బిరుదును పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. ‘పవర్ స్టార్’ బిరుదును తనకు వద్దని ఓ రాజకీయ సమావేశంలో చెప్పిన ఆయన..’భీమ్లా నాయక్’ సినిమాలో దాన్ని నిజం చేశారు. ‘పవర్ స్టార్’ అనే బిరుదు లేకుండానే పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెంట్ చేశారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు.

‘భీమ్లా నాయక్’ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ ఇంట్రడక్షన్ షాట్ లో పేరుకు ముందు ఉండే ‘పవర్ స్టార్’ బిరుదు లేకుండానే స్క్రీన్‌పై కనిపించారు. దీనిపై పలువురు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇకపై పవన్ నటించే సినిమాలన్నింటిలోనూ పవన్ కల్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ అనే బిరుదును తీసేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఓ రాజకీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. తన అభిమానులు ఇకపై తనను పవర్ స్టార్ అని సంబోధించవచవద్దని కోరిన విషయం తెలిసిందే. తనను పవన్ కల్యాణ్ అని పిలిస్తే చాలని అప్పుడు ఆయన అన్నారు. ఇప్పడదే మాటను ‘భీమ్లా నాయక్’ సినిమాలో అప్లే చేశారు. ఇప్పుడు వెండితెరపై తమ అభిమాన నటుడి పేరుకు ముందు పవర్ స్టార్ లేకపోవడం చూసి పవన్ కల్యాణ్ అభిమానులు షాక్ కు గురయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -