రజినీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తుంటారు. తమిళంలోనే కాకుండా ఇతర భాషలో కూడా రజినీకి భారీగానే అభిమానులు ఉన్నారు. బాషా సినిమా తర్వాత మళ్లీ డాన్ గా నటిస్తోన్న సినిమా కబాలి. ఇటివలే ఈ చిత్రాన్నికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. మెరిసిన జుట్టు, గడ్డంతో వయసు మళ్లిన డాన్ గా రజినీ కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్నికి రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా రజినీ సరసన రాధిక ఆప్టే హీరోయిన్‍గా నటిస్తోంది.
ఇక ఈ కబాలి సినిమా విశేషాల సంగతికి వస్తే.. ఈ చిత్రం ఎక్కవ భాగం మలేషియాలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో విలన్ తో పాటు ఇతర నటలు కూడా విదేశీ నటులు కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం లో విలన్ గా ప్రముఖ తైవాన్ నటుడు వినస్టన్ చావొ నటించగా మరో విలన్ గా మలేషియా నటుడు రోసియమ్ నౌర్ నటించారు. మలేసియాలో షూటింగ్ జరపడం వల్ల రజినీ అభిమానులు అతని చూడటానికి వేల సంఖ్యలో వచ్చారట. ఈ సినిమాలో కనిపించే కార్లు రజినీ అభిమానులే సమకూర్చారట. అలాగే ఈ చిత్రంలో రజినీ కుతు అనే తమిళ సంప్రదాయ నృత్య సన్నివేశం చేయనున్నాడట.
అను వర్ధన్ అనే అమ్మాయి రజినీకి కాస్టూమ్ డిజైనర్ గా పని చేశారు. గతంలో రజినీ చిత్రాలకు ఇండియాతో పాటు జపాన్, చైనా తదితర దేశాల్లో మాత్రే డిమాండ్ ఉండేది. కానీ కబాలితో రజినీ చైనీస్, మలై, థాయ్, జపనీస్ భాషల్లోకీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. అలాగే కబాలి కోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ కూడా రూపొందిచారు. ఆ అప్లికేషన్ ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఉంచారు. సో ఈ చిత్రం తో రజినీ భారీ హిట్ తో పాటు భారీ కలెక్షన్స్ వసలు చేస్తాడు అంటున్నారు సినీ పండితులు.
