Monday, May 13, 2024
- Advertisement -

చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక

- Advertisement -

చిరంజీవి – ఈ పేరు చెబితే కష్టపడి పైకి వచ్చేవాళ్ళు అందరికీ ఇన్స్పిరేషన్ అని చెబుతూ ఉంటారు. జీవితం లో లేక సినిమాలలో ఏ అంశంలో పైకి రావాలి అన్నా చిరంజీవి ని ఆదర్శంగా తీసుకున్నవారు ఎందఱో ఉంటారు. అయుతే తన సొంత ఇంట్లో కూడా చిరంజీవి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.

ఆయన తరవాత ఇండస్ట్రీ కి హీరోగా వచ్చిన నిలదొక్కుకున్న పవన్ కళ్యాణ్ దగ్గర నుంచీ చిరు తనయుడు రాం చరణ్ , మిగిలిన బంధుగణం సాయి ధరం తేజ, అల్లూ అర్జున్ , వరుణ్ తేజ్ ఇలా చాలా మంది పూర్తిగా చిరు ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళే. ఇప్పుడు వారిలో కొణిదెల నిహారిక జాయిన్ అయ్యింది.

ఒక మనసు తో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఈమె తన లైఫ్ లో అతిపెద్ద ఇన్స్పిరేషన్ చిరంజీవి అనీ ఆయనని చూసే హీరోయిన్ అవ్వాలి , సినేమాల్లోకి రావాలి అనుకున్నాను అని చెబుతోంది ఆమె. ” నటనపై ఇష్టం ఉందని చెప్పగానే, ఇంట్లోవాళ్ళంతా ఎంతో మంచి సపోర్ట్ ఇచ్చారని తెలుపుతూ, నటన పరంగా చిరంజీవి గారే తనకు ఇన్స్పిరేషన్ అని తెలిపారు. “చిన్నప్పట్నుంచీ పెదనాన్న (చిరంజీవి) సినిమాలే ఎక్కువగా చూస్తూ పెరిగా. ఆయనే నాకు ఇన్స్పిరేషన్” అంది నిహారిక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -