Sunday, May 5, 2024
- Advertisement -

#RRR కాస్త‌ #RRRR.. రామ్‌చ‌ర‌ణ్‌, రామ‌రావు, రాజ‌మౌళి, రాజ‌శేఖ‌ర్‌

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో స‌రికొత్త విల‌న్ రూపుదిద్దుకుంటున్నాడు. ఒక క్రేజీ సినిమాకు మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ రాబోతోంది. ప్ర‌స్తుతం వేస‌విలో సినిమా పండుగ అయిపోయిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌క‌టించిన #RRR సినిమా మొద‌లెట్టే అవ‌కాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే #RRR కాస్తా #RRRR అయ్యేట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో న‌టించే న‌టుడు రాజ‌శేఖ‌ర్ అని తెలుస్తోంది.

రాజ‌మౌళి త‌న సినిమాలో విల‌న్‌ల‌కు హీరో మాదిరి ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు విల‌న్‌గా సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చాడ‌ని స‌మాచారం. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రాజశేఖర్ ఇటీవ‌ల గ‌రుడ‌వేగ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. అయితే ఆయ‌న త‌న త‌ర్వాతి సినిమా రాజ‌మౌళితో అది విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని టాలీవుడ్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా క‌థ‌ను రాజ‌మౌళి రాజ‌శేఖ‌ర్‌కు వినిపించాడు అని స‌మాచారం.

అయితే గ‌తంలోనే రాజ‌శేఖ‌ర్‌కు విల‌న్‌గా అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారింది. ఖైదీ నెం. 150 చిత్రంలో విలన్ రోల్ చేయాలని ఆశపడిన రాజ‌శేఖ‌ర్‌కు కుదరలేదు. ఇప్పుడు రాజమౌళి విల‌న్ పాత్ర ఇవ్వగానే వెంటనే ఒప్పుకున్నాడని తెలుస్తోంది. రాజశేఖర్ రూపంలో ఈ సినిమాలోకి మరో ఆర్ వచ్చి చేరనుందని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -