Tuesday, April 30, 2024
- Advertisement -

పెళ్ళి పుకార్లలో ఇరుక్కున్న ప్రభాస్ బ్యూటీ

- Advertisement -

సాహో సినిమా తో తెలుగు మరియు తమిళ భాషల్లో అరంగేట్రం చేస్తున్న హీరోయిన్ శ్రద్ధ కపూర్. ఈ రెండు సినిమాల తో శ్రద్ధ తన క్రేజ్ ని సౌత్ కి కూడా తీసుకొని వస్తుంది. శ్రద్ధ విషయం లో సాహో టీమ్ కూడా ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. అన్నీ ప్రమోషన్స్ లో ప్రభాస్ కి శ్రద్ధ కి సమానమైన స్పేస్ ఇస్తూ ఇద్దరూ ఒకే లాగా హైలైట్ అయేలా చూసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు ఈ హీరోయిన్ పెళ్ళి గురించిన వార్తలు ప్రచారం లో ఉన్నాయి. ఇప్పటి వరకు శ్రద్ధ కపూర్ ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ మీడియా మాత్రం ఆల్రెడీ సెలెబ్రిటీ ఫాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ కి శ్రద్ధ కి మధ్య ప్రేమ సాగుతుంది అని ఎప్పుడో చెప్పింది.

ఈ ఏడాది ప్రథమార్థం లో వీరు ఇద్దరు పెళ్లి కి సిద్ధం అయ్యారు అనే వార్తలు రాగా, శ్రద్ధ తండ్రి శక్తి కపూర్ వాటిని పూర్తిగా ఖండించిన సంగతి మనకి తెలిసిందే. అయితే ఆయన చాలా స్పష్టంగా ఈ ఏడాది శ్రద్ధ వివాహం ఉండదు అని మెన్షన్ చేసాడు. ఇకపోతే శ్రద్ధ మరిన్ని సౌత్ సినిమాల్లో భాగం కావలి అని చూస్తుందట. సాహో రిలీజ్ అయితే కానీ శ్రద్ధ కి సౌత్ కలిసి వస్తుందా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ రాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -