Friday, April 19, 2024
- Advertisement -

అదంతా మీడియా సృష్టే అని తేల్చేసిన నాని

- Advertisement -

విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో ప్రస్తుతం నాని ఒక ఆసక్తికర సినిమా కి పని చేస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని ఈ సినిమా కి ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఇంతకు ముందు చిరంజీవి ఈ టైటిల్ ని వాడుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయినా కానీ, గత కొంత కాలం గా సినిమా షూటింగ్ సవ్యం గా సాగడం లేదని, సినిమా కి బడ్జెట్ ఎక్కువ అయినా కారణం గా సినిమా అనుకున్న రీతి లో రావడం లేదని, నిర్మాతలు సంతృప్తికరం గా లేరని, షూటింగ్ ఆగిపోయిందని, విడుదల వాయిదా పడబోతుందని, ఇలా ఎన్నో పుకార్లు వచ్చాయి.

అయితే నాని మాత్రం అన్నిటికీ మౌనం గా ఉన్నాడు. ఒకప్పుడు ఏమైనా రూమర్ వస్తే నాని వెంటనే స్పందించేవాడు. అలాంటిది ఇప్పుడు మాత్రం నాని చాలా మౌనం గా ఉన్నాడు. దీనికి కారణం ఏంటి అనేది తెలియదు కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా విడుదల ఆగస్టు 30 న అని మళ్ళీ ఒకసారి ట్వీట్ చేసింది.

ఈ లెక్కన సినిమా మీద వస్తున్న పుకార్లు అన్నీ మీడియా సృష్టే అని, అంతా సవ్యం గా సాగుతుంది అని అనుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -