బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే అందరు ఠక్కున చెప్పే పేరు శ్రద్ధా కపూర్. అష్కీ-2 సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా. ఈ సినిమా హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో కొంతకాలం ప్రేమయాణం సాగించింది. వీరిద్దరు కొన్నాళ్లు బాగానే చట్టాల్ పట్టాల్ వేసుకుని తిరిగారు. ఏమైందో ఏమో తెలియదు కాని సడన్‌గా వీరిద్దరు విడిపోయారు. ఆదిత్యరాయ్ కపూర్‌తో విడిపోయిన తరువాత నటన మీద ఫోకస్ పెట్టి స్టార్ హీరోయిన్‌గా మారింది.
బాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల హడావిడి సాగుతఉంది. ప్రియాంక చోప్రా,దీపిక పదుకునేలు పెళ్లి చేసుకున్నారు.దీంతో ఈ భామకు కూడా పెళ్లిపై మనస్సు మళ్లినట్లుంది. శ్రద్ధా మరోసారి ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రద్ధా ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో పడిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో శ్రద్ధా డేటింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ అర్థరాత్రి రోడ్డుపై షికార్లు చేస్తూ.. మీడియా కంటికి చిక్కారు. ఇంకేముంది.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై శ్రద్ధా ఎలా స్పందిస్తుందో చూడాలి. శ్రద్ధా కపూర్ ప్రస్తుతం సైనా నేహ్వాల్ బయోపిక్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు ఆమె మొదటిసారి తెలుగు సినిమాలో కూడా నటిస్తుంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సాహో సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది శ్రద్ధా.
- విజయ్ చేయాల్సిన ‘డీసీ’, అసలు నిజమేంటి?
- ఇది కేవలం నా సినిమా కాదు.. గ్లోబల్ ఇండియన్ మూవీ: యశ్
- ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ సునామీ.. రూ.9,500 కోట్లకు పైగా..
- ‘గెలిచేదాకా ఆగకూడదు. ఆ తర్వాత మాట్లాడకూడదు’
- ఎన్టీఆర్ ను ఇమిటేషన్ చేసిన సత్య.. వరుణ్ తేజ్ ఎమన్నారంటే
