Saturday, April 20, 2024
- Advertisement -

మ‌రో 20 సినిమాలు చేశాక… పిల్ల‌లును కంటా!

- Advertisement -

హీరోయిన్ శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలంద‌రి ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించింది. శ్రియ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుష్క‌ర కాలం పూర్తైంది. అయిన ఇప్ప‌టి వ‌రస సినిమాలలో అవ‌కాశాలు వ‌స్తునే ఉన్నాయి. తాజాగా మెగా డాట‌ర్ నిహారిక‌, శ్రియ ప్రధాన పాత్ర‌లతో ఓ సినిమా ప్రారంభం కూడా అయింది. అయితే శ్రియకి ఈ మ‌ధ్య‌నే పెళ్లి అయిన సంగ‌తి తెలిసిందే. దాంతో శ్రియ ఇక సినిమాలకి టాటా చెప్పేసినట్టేనని అంతా అనుకున్నారు.

దీనిపై శ్రియని అడిగితే పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు కదా! హీరోయిన్స్‌కు పెళ్లి అయితే సినిమాలు చేయ‌కూడ‌దా? అని ఎదురు ప్ర‌శ్నించింది. ఇక పెళ్లి అవ్వ‌గానే పిల్ల‌లు ఎప్పుడంటారు. నేను ఇంకో ఇర‌వై సినిమాలు చేసిన త‌రువాత కాని పిల్లలు గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -