Wednesday, May 8, 2024
- Advertisement -

అందాల భామ శ్రియా వయసు ఎంతో తెలుసా..?

- Advertisement -

శ్రియా.. ఈమె అందాన్నికి ఎవరైన ఫిదా అవ్వాల్సిందే. ఏం చేసిన ఆమె ఓ ప్రత్యేకత ఉంది. తన నడుమందాల నాజుకు షోకులతో కుర్రకారును ఈ నాటికి కిర్రెక్కిస్తోన్న అందాల తార శ్రియా శరణ్ నేడు 36వ వసంతంలోకి అడుగిడుతోందండీ. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగిన శ్రియా.. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది.

డిగ్రీ చదివేటప్పుడే లెక్చరర్ కోరిక మేరకు ఒక డ్యాన్స్ వీడియోలో కనిపించింది శ్రియా. 19 ఏళ్ల వయసులో 2001లో మొదటిసారిగా తెలుగు సినిమా ‘ఇష్టం’లో నటించి అందరూ తనను ఇష్టపడేలా చేసింది. ఆ తర్వాత నాగర్జున నటించిన సంతోషంలో హీరోయిన్ గా చేసి.. సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత శ్రియా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ టాప్ హీరోస్ అదేనండి మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరకు – బాలయ్య నుంచి విక్టరీ వెంకటేశ్ వరకు – తరుణ్ నుంచి ప్రభాస్ వరకు దాదాపు అందరి హీరోలతో శ్రియ జతకట్టింది.

ఇలా 17 ఏళ్ల నుంచి తన నాజూకు నడుమందాలతో రస ప్రియులకు నిద్ర లేకుండా చేసింది.. చేస్తోంది. తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగు – తమిళమే కాకుండా దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లోనూ అలరించింది. ఇక ఇటివలే బాలయ్య పైసా వసూల్ లో నటించింది. ఆమె మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుంటూ మరిన్ని సినిమాలు తీసి.. ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -