చంద్రబాబు మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అనంతపురంలో ఫలితాల్ని ఇస్తున్నట్లే కనిపిస్తోంది. జగన్ లండన్‌నుంచి తిరిగి వచ్చేలోపు తన పని పూర్తి చేయాలని పెట్టుకున్న బాబు శరవేగంగా పావులు కదుపుతున్నారు. వైసీపీకి పట్టున్న జిల్లాలలోని కీలక నాయకులను టీడీపీలోకి చేర్చుకొని జగన్ ను సాధ్యమైనంత వరకు దెబ్బ కొట్టాలని బాబు భావిస్తున్నారు.
అనంపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిధ్ధం చేసుకుంటున్నారు. ఇది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే. ఇదిలా ఉంటె ఇప్పుడు మరో షాకింగ్ వార్త ఆపార్టీనేతలను కలవర పెడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ ఖండువా కప్పుకొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయనడంలో సందేహంలేదు . ఇప్పటికె బాబుతో మంతనాలు పూర్తయ్యాయి.
అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పటికీ, వెనక నుంచి పార్టీ కార్యక్రమాలన్ని చక్కబెట్టేది మధుసూదన్ రెడ్డే అనేది నియోజకవర్గ ప్రజల భావన. అందుకె చంద్రబాబు వైసీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తున్నారు.
రాయలసీమలో వైసీపీకి మంచి పట్టున్న సంగతి తెలిసిందే. ముందుగా జగన్‌ను రాయలసీమలో దెబ్బకొట్టాలని బాబు పావులు కదుపుతున్నారు. రెడ్డి సామాజిక వర్గంతోనె జగన్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకె పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రు పదవులు ఇచ్చిన సంగతి తెలసిందే. ఇప్పుడు కూడా బాబు అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. 2019 ఎన్నికల నాటికి వీలైనంతగా జగన్‌ను మానసికంగా దెబ్బతీయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ కార్యక్రమాలవిషయంలో ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గత కొంత కాలంగా ఆయనకు ప్రాధాన్యతను తగ్గించారని… అదే కుటుంబంలో ఉన్న మరో వ్యక్తి ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని… ఈ నేపథ్యంలోనే, తన రాజకీయ భవిష్యత్తు కోసం మధుసూదన్ రెడ్డి టీడీపీలో చేరాలని భావించినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్లుగానె బాబు తన వ్యూహాలను చాపకింద నీరులా అమలు చేస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ ముందచూపుతో వ్యవహరించకపోతె మరింత పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు.
