Sunday, May 19, 2024
- Advertisement -

నాగ్ ఆఫీస‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్‌…

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి ‘ఆఫీసర్’ అనే టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి.

మొన్న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తార‌ని, టైటిల్ ఏంటో ప్ర‌క‌టిస్తార‌ని చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించి చిత్ర‌బృందం ఓ ప్ర‌క‌ట‌న కూడా చేసింది. అయితే శ్రీ‌దేవి హ‌ఠాన్మ‌ర‌ణంతో టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు రాలేదు. అయితే.. ఈ చిత్రానికి ‘ఆపీస‌ర్‌’ అనే టైటిల్‌ని ఖ‌రారు చేసి వర్మ ఈ సినిమా ఫస్టులుక్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఆసక్తిని రేకెత్తిస్తూ ఫస్టులుక్ మోషన్ టీజర్ ను కూడా వదిలాడు.

గన్ తో షూట్ చేస్తూ నాగార్జున చాలా సీరియస్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమాను మే 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ఫస్టులుక్ పోస్టర్ ద్వారానే స్పష్టం చేశాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన మైరా సరీన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -