Wednesday, May 15, 2024
- Advertisement -

పభ్లిక్ లో శ్రుతిహాసన్.. తన లవర్ తో ఏం చేస్తుందంటే..?

- Advertisement -

శ్రుతిహాసన్.. ఆ మధ్య బ్రిటన్ వెళ్లి బాయ్ ఫ్రెండ్ ని కలిసి వార్తల్లోకి ఎక్కింది. ఈ ముద్దుగుమ్మ ఒక విదేశీ బాయ్ ఫ్రెండ్ ను సంపాదించిందని.. అతడు లండన్ లో ఉంటాడని.. వీరిద్దరు లవ్ లో మునిగి తెలుతున్నారని.. వీరి ప్రేమకు కమల్ ఆశీస్సులు కూడా ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే ఈ లవ్ విషయంపై శ్రుతి హాసన్ నోరు విప్పలేదు. ఇప్పుడూ ఆసక్తికరమైన సంగతి ఏంటంటే.. శ్రుతి విదేశీ బాయ్ ఫ్రెండ్ ఇండియాకు వచ్చాడు. మైఖేల్ కొర్సలే అనే అతడు ఇటాలియన్. లండన్ లో ఉంటాడు. బుధవారం రాత్రి తను లండన్ నుంచి ముంబైలో దిగాడు. అతడిని రిసీవ్ చేసుకోవడానికి శ్రుతిహాసన్ స్వయంగా వెళ్లింది. దాంతో మీడియా కంట పడింది. ఈ సంగతిని ముంబై మిర్రర్’ రిపోర్ట్ చేసింది. బుధవారం మైఖేల్ లండన్ నుంచి వచ్చాడని, అతడిని శ్రుతి వెంట తీసుకెళ్లిందని ఆ పత్రిక ప్రత్యేక కథనం రాసింది.

ప్రస్తుతం శ్రుతి తన తండ్రి సినిమా ‘శభాష్ నాయుడు’ షూటింగ్ కోసం ముంబైలో ఉంది. మరి విరామానంతరం ప్రియుడిని చూడగానే శ్రుతి కంట్రోల్ చేసుకోలేకపోయినట్టుంది. అతడు కారులోకి ఎక్కగానే గట్టిగా వాటేసుకుంది. ఈ సీన్ కూడా మీడియా కంట పడింది. కెమెరాలు క్లిక్‍మనిపించాయి. ఒక సౌత్ హీరోతో బ్రేకప్ తర్వాత శ్రుతిహాసన్ చాలా కాలం పాటు సోలోగా గడిపేసింది. ఇప్పుడు మాత్రం ప్రియడితో విలువై సమయాన్ని గడుపుతున్నట్లుగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -