Tuesday, May 14, 2024
- Advertisement -

ఎందుకు భ‌య‌ప‌డింది….కారనం ఏంటి…?

- Advertisement -

2001లో భారత పార్లమెంటుపై పాక్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కొందరు దాడి చేశారు. ఈ దాడిని పార్లమెంటు రక్షణా సిబ్బంది వీరోచితంగా అడ్డుకున్నారు. భారత పార్లమెంటుపై జరిగిన దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహాం వ్యక్తమైంది. పాక్‌కు బుద్ది చెప్పాలన్న భారత ప్రభుత్వం ఆపరేషన్‌ పరాక్రమ్‌ పేరిట పాక్‌ సరిహద్దులకు భారీ ఎత్తున సాయుధ దళాలను తరలించింది. పాక్‌ కూడా తన దళాలను సిద్ధం చేసింది.

అయితే పాక్ మాజీ సైన్యాధ్య‌క్షుడు ముష‌ర‌ఫ్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.భారత్‌పై అణుబాంబులతో దాడులు జరపాలని 2001లో యోచించినట్టు వెల్ల‌డించారు.001లోభారత దళాలు పాక్‌ సరిహద్దుల వెంబడి మోహరించాయి. పాక్‌ కూడా యుద్ధానికి సిద్ధమైంది. ఒకానొక దశలో భారత్‌పై అణుబాంబు ప్రయోగించాలని అనుకున్నామని అయితే భారత్‌ వద్ద కూడా అణుబాంబులు ఉన్న విషయం గుర్తుకు రావడంతో ఆ యోచనను విరమించినట్టు తెలిపారు.

ఇక్క‌డే పాక్ వెన‌క‌డుగు వేసింది. పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నప్పటికీ భారత్‌ వద్ద ఉన్న అణ్వాస్త్రాల సంఖ్య ఎక్కువని పాక్‌ రక్షణ రంగనిపుణుల అనుమానం. భారత్‌పై ఎలాంటి దాడి జరిగినా నిమిషాల్లోనే పుంజుకొని తిరిగి తిప్పికొట్టగల సామర్థ్యం ఉంది. దీన్ని గ్రహించిన ముషారఫ్‌ అణుబాంబు దాడికి వెనుకంజ వేసినట్టు తెలుస్తోంది.

1999లో ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను అధికారంలోకి దించివేసిన ముషారఫ్‌ 2001 నుంచి 2008 వరకు పాక్‌ సైనిక పాలకునిగా కొనసాగారు. కొద్ది సంవత్సరాల కిందట పాక్‌లో ఎన్నికలు నిర్వహించారు. నవాజ్‌షరీఫ్‌ ఆధ్వర్యంలోని పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ తిరిగి విజయం సాధించింది. ముషారఫ్‌పై అనేక అభియోగాలు నమోదయ్యాయి.ముషారఫ్‌ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా విదేశాల్లో చికిత్స పొందేందుకు షరీఫ్‌ అనుమతించడంతో ముషారఫ్‌ విదేశాల్లో ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -