Thursday, May 16, 2024
- Advertisement -

విజయవంతమైన ‘లవ్ ఫెయిల్యూర్’

- Advertisement -

తెలుగు మరియు తమిళ భాషల్లో వసుస విజయాలు సాధించిన శృతి హాసన్ సడన్ గా ఇక్కడ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి, బాయ్ ఫ్రెండ్ తో లండన్ చెక్కేసి అక్కడ మ్యూజిక్ కెరీర్ మీద దృష్టి పెట్టింది. అంతా సజావుగా సాగిపోతుంది అనుకుంటున్నా తరుణం లో సడన్ గా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ ప్రకటించాక శృతి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి సినిమాల మీద ఫోకస్ పెట్టింది. అయితే శృతి హాసన్ కి నిజానికి ఎప్పుడూ అవకాశాలు తగ్గలేదు. శృతి నే కావాలని సినిమాలకి దూరం గా ఉండాలని నిశ్చయించుకుంది. అయితే ఒక దశ లో బ్రేకప్ అయ్యాక మళ్ళీ అవకాశాలు వస్తాయా రావా అనే సందిగ్ధం లో పడిపోయిన శృతి కి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సక్సెస్ అయిందనే విషయం తెలుసుకొని ఆనందపడుతుంది.

అందరికీ లవ్ ఫెయిల్ అయితే డిప్రెషన్ అనేది కామన్ గా ఉంటుంది కానీ శృతి కి మాత్రం ఇది కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే ఆసక్తికరం అంశం ఏంటి అంటే ఇప్పుడు కూడా శృతి చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఆమె కోరుకోవాలి గానీ స్టార్ హీరోలు సైతం ఆమె పక్కన చేయడానికి రెడీ గా ఉన్నారు. అందుకని ఒక రకంగా ఇది విజయవంతమైన ‘లవ్ ఫెయిల్యూర్’.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -