Monday, April 29, 2024
- Advertisement -

స్టార్ హీరోపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన శృతి హాస‌న్‌

- Advertisement -

శృతి హాసన్ స్టార్ హీరో క‌మ‌ల్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికి త‌క్కువ కాలంలోనే త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేసి సూప‌ర్ హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. శృతి హాస‌న్ గ‌త కొద్దికాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలు మానేసి బాయ్‌ఫ్రెండ్‌తో చ‌ట్టాల్ ప‌ట్టాల్ వేసుకుని తిరుగుతుంది ఈ భామ‌. శృతి సినిమాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికి ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం త‌గ్గ‌లేదు. తాజాగా ఈ భామ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శ్రుతిహాసన్‌ చాలా సహనంగా బదులిచ్చింది. మాకు ఇష్ట‌మైన హీరో అని అడగ్గా క‌మ‌ల్ పేరు చెప్పింది.

ఇష్ట‌మైన సినిమా త‌న తండ్రి న‌టించిన మహానది అని చెప్పుకొచ్చింది. సినీరంగంలో మీరు కోరుకునేది? అన్న ప్రశ్నకు తాను నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలి పేరు తెచ్చుకున్నా, వీటన్నింటిలోనూ తాను కోరుకునేది ఎంటర్‌టెయిన్‌మెంట్‌నేనని చెప్పింది. ఇక స్టార్ హీరో అజిత్ గురించి అడగ్గా తన‌కు ఇష్ట‌మైన హీరోల‌లో ఆయ‌న కూడా ఒక‌ర‌ని, చాలామంచి వ్య‌క్తి అని తెలిపింది. అజిత్‌తో క‌లిసి శృతి హాస‌న్ వేదాళం సినిమాలో న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది.శృతి హాస‌న్ ఇప్పుడు బాలీవుడ్‌లో ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లుకానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -