Thursday, May 16, 2024
- Advertisement -

నేను తాగుతా ,స్మోక్ చేస్తా అయితే ఏంటీ – స్టార్ హీరోయిన్

- Advertisement -

బాలీవుడ్ భామ‌లు ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ హ‌డావిడి చేస్తున్నారు.తాజాగా బాలీవుడ్ న‌టి శ్వేతా సాల్వే హాట్ కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచింది.శ్వేతా సాల్వే ఇటీవల తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవాకి వెళ్లింది. అక్కడ బికినీలో స్మోక్ చేస్తూ తీసుకున్న ఫోటోని శ్వేతా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.ఓ సెల‌బ్రిటీగా ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటీ అని ఆమె మీద మండిప‌డుతున్నారు.ఆమెని వ్య‌క్తిగ‌తంగా దూషింయ‌డంతో వారికి కౌంట‌ర్ ఇచ్చింది శ్వేతా సాల్వే. ”నేను తాగుతాను.. స్మోక్ చేస్తాను. నిజాయితీగా ఉంటాను.

నేను డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం వంటి కారణాల వలన మంచి తల్లిని కాకుండా పోతానా..? నా జీవితాన్ని వృధా చేసుకోవడం మీరు చూశారా..? పని చేయకుండా ఖాళీగా ఉండడం మీరు చూశారా..?నా పిల్లలను నేను నిర్లక్ష్యంగా వదిలేయడం మీరు చూశారా..? రోజూ ఎన్నో పనులతో నేను బిజీగా ఉంటాను. నేను నటిని, డాన్సర్ ని, పారిశ్రామికవేత్తని కూడా.. ఇతరులను నేను ఈ విధంగా ప్రశ్నించను. నా ప‌ని నేను క‌రెక్ట్‌గానే చేస్తున్నాను.మీకు లాగా ప‌ని పాట లేకుండా సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తు టైం వెస్ట్ ప‌నులు నేను చేయ‌న‌ని నెటిజ‌న్ల‌కు కాస్తా ఘాటుగానే స‌మాధానం ఇచ్చింది శ్వేతా సాల్వే .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -