Tuesday, May 21, 2024
- Advertisement -

చిరు ప‌రామ‌ర్శ దేనికి సంకేంతం…?

- Advertisement -

జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మీద క‌త్తితో దాడి జ‌రిగిన త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు జ‌గ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు ప్ర‌జాద‌ర‌ణ అద్భుతం. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న స‌మ‌యంలో క‌త్తి దాడి ఘ‌ట‌న త‌ర్వాత ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మ‌రింత క్రేజ్ పెరిగిపోయింది.

అనేక స‌ర్వేల ఫ‌లితాలు కూడా వైసీపీ గెలుపు మీద అంచనాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.రేపటి ఎన్నికల్లో గెలిచే పార్టీగా ముందున్న వైసీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్ ఇపుడు ఏపీలో మార్మోగుతున్న పేరు. హ‌త్యాయ‌త్నంనుంచి బ‌య‌ట‌ప‌డిన అనంత‌రం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం జగన్ ఇంట్లో విశ్రాంత్రి తీసుకుంటున్నారు. జ‌గ‌న్‌ను అనేక మంది రాజ‌కీయ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. తాజాగా కెంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి జగన్ కి ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చిరంజీవి ఈ మధ్యన రాజకీయంగా అంత చురుకుగా లేరు. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా రెన్యూవల్ చేసుకోలేదు. సినిమాల‌తో బిజీగా ఉన్న చిరంజీవి రాజ‌కీయాల‌కు గుడ్‌బాయ్ చెప్పార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే జనసేన వెనక ఉన్నారని తమ్ముడు పార్టీకి సలహా సూచనలు ఇస్తూ చిరంజీవి తెర వెనక‌ భూమికను పోషిస్తున్నారని అంటున్నారు.

జ‌గ‌న్‌ను చిరంజీవి ప‌రామ‌ర్శించిన త‌ర్వాత రాజకీయంగా తీసుకుంటే రేపటి రోజున జనసేన, వైసీపీ స్నేహ బంధానికి ప్రాతిపదికగా చూడొచ్చా అన్న ఆస‌క్తిక‌ర‌మైన చర్చ సాగుతోంది. వైసీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య పెద్ద‌గా వైరం లేదు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా ప్ర‌తిప‌క్ష పార్టీలు. ఒక‌రి మీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నా ఇద్ద‌రూ కూడా టీడీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై పోరాడుతున్నారు. ఈ మ‌ధ్య‌న ప‌వ‌న్ కూడా తన మీటింగులలో జగన్ అంటే తనకు శత్రువు కానే కాదని చెప్పుకొస్తున్నారు.

దీన్ని బట్టి చూసుకుంటే రెండు పార్టీలు కలసి నడిచేందుకు పెద్దగా అభ్యంతరాలు లేవు. పైగా ఇద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు ఉండనే ఉన్నారు. దానికి నాందిగానే చిరంజీవి ఫోన్ ని చూడాలని అంటున్నారు. మరి రేపటి రోజున జగన్, పవన్ బంధం గట్టిపడేందుకు ఓ పెద్దగా చిరంజీవి తెర వెనక పెద్దగా ప్రయత్నాలు చేస్తారేమోనన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటె రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -