Friday, March 29, 2024
- Advertisement -

సౌత్ హ్యాండ్సమ్ కు అంతగా కాలిందా..?

- Advertisement -

అప్పటివరకు ఓ వెలుగు వెలిగి.. ఆతర్వాత సైలంట్ అయిన హీరో దగ్గరకు వెళ్లి… కెళికితే ఎవరికైనా ఎలా ఉంటుంది. ఒళ్లు మండుతుంది కదా. సౌత్ హ్యాండ్సమ్ సిద్ధార్థ్ కు కూడా అదే విధంగా మండింది. ఎంత మీడియా అయితే మాత్రం నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తానంటే కుదరదు కదా. ఒకప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోని ఏ మీడియా ప్రతినిధి అలా కొశ్చన్ చేయకూడదు.

సిద్ధార్థ్ గ్రాఫ్ పడిపోయిందనే మాట వాస్తవమే అయినా…మొకం మీద అడగడం ఏమాత్రం భావ్యం కాదు. సదరు ఆ రిపోర్ట్ గారికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా. గొట్టం ఉంది కదా అని ముందు పెట్టేసి….ఏదో కొశ్చన్ అడిగేస్తే ఎలా. సిద్ధూ తమిళ్ హిట్ పిక్చర్ అవల్ డబ్ వెర్షన్ ..తెలుగులో గృహం పేరుతో రిలీజ్ అవుతుంది కదా అని వస్తే…అతన్ని అంతలా అవమానించడం నిజంగా దారుణమనే చెప్పాలి. మీరు సక్సెస్ చూసి ఇన్నేళ్లయింది కదా.. మీకెలా వుంది? పాపులారిటీ తగ్గిందన్న బాధ లేదా? అని అడిగితే.. సిద్ధార్థ్ ‘కదిలిపోయాడు’. కాని వెంటనే తేరుకుని సినిమాలు ఆడినా ఆడకపోయినా నా ఇమేజ్ ఇంచ్ కూడా తగ్గిందని నేను భావించడం లేదు.. అంటూ సమాధాన మిచ్చాడు. అక్కడితో ఊరుకోకుండా… నేనేంటో నాకు తెలుసు.. అంటూ చురుక్కుమనిపించే జవాబిచ్చి ఆ రిపోర్ట్ మొఖం మీద చెప్పి..ఖంగుతినిపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -